LOADING...
Silver: వెండికి భారీ షాక్‌.. కిలోపై రూ.10,000 తగ్గింపు!
వెండికి భారీ షాక్‌.. కిలోపై రూ.10,000 తగ్గింపు!

Silver: వెండికి భారీ షాక్‌.. కిలోపై రూ.10,000 తగ్గింపు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతుండటం, అమెరికా డాలర్‌ బలపడటం, అక్కడి బాండ్‌ రాబడులు పెరగడం వంటి పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం,వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు చైనాలో పారిశ్రామిక, తయారీ రంగాల వృద్ధి మందగించడంతో వెండికి డిమాండ్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో వెండి ధరల్లో మరింత ఒత్తిడి కనిపిస్తోంది.

వివరాలు 

61.9 డాలర్ల వద్ద ఔన్సు వెండి ధర

మంగళవారం రాత్రి 11.30 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 54 డాలర్లు తగ్గి 4,130 డాలర్లకు చేరింది. అదే సమయంలో ఔన్సు వెండి ధర 5.3 శాతం క్షీణించి 61.9 డాలర్ల వద్ద నిలిచింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా కనిపించింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.2,000 తగ్గి రూ.1,49,300కు చేరగా, కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 పడిపోయి రూ.2,33,000 వద్ద నమోదైంది.

Advertisement