Loading...
Stock Market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 183 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
నష్టాల్లో ముగిసిన సూచీలు.. 183 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

Stock Market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 183 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ.. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 183.15 పాయింట్లు (0.24 శాతం) కోల్పోయి 77,472.94 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126.80 పాయింట్లు (0.52 శాతం) పడిపోయి 24,207.75 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఆ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి.

వివరాలు 

సెన్సెక్స్‌ 30

సెన్సెక్స్‌ 30లో ఇన్ఫోసిస్‌,భారతీ ఎయిర్‌టెల్‌,ఎల్‌అండ్‌టీ,పవర్‌గ్రిడ్‌,టెక్‌ మహీంద్రా,ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి.

మరోవైపు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి.

రంగాల వారీగా చూస్తే ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, వినియోగ వస్తువుల రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

దీనికి విరుద్ధంగా లోహాలు, ప్రైవేటు బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు నమోదయ్యాయి. విస్తృత మార్కెట్‌లోనూ మిశ్రమ ధోరణి కనిపించింది.

వివరాలు 

బంగారం ఔన్సు ధర 4,618.87 డాలర్లు 

నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీ 0.8 శాతం లాభపడగా.. మిడ్‌క్యాప్‌ సూచీ స్వల్పంగా తగ్గింది.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 85.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

చమురు ధరలు తగ్గడం భారత్‌ వంటి చమురు దిగుమతి దేశాలకు కొంత సానుకూల అంశమైనప్పటికీ.. దాని ప్రభావాన్ని దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు అందిపుచ్చుకోలేకపోయాయి.

మరోవైపు బంగారం ధరలు కూడా బలహీనంగా సాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర 4,618.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT