Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. త్వరలో వెలువడనున్న ఆర్బీఐ కొత్త పాలసీ
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతుండటంతో పాటు ఆర్బీఐ పాలసీ త్వరలో విడుదల కానుందన్న వార్తల కారణంగా మార్కెట్ ఉత్సాహంగా కనిపించింది. గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా గ్రీన్‌లోనే ట్రేడ్ చేసి, చివరికి సెన్సెక్స్ 809 పాయింట్ల లాభంతో 81,765 వద్ద, నిఫ్టీ 240 పాయింట్ల లాభంతో 24,708 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.73 వద్ద నిలిచింది.
అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి
నిఫ్టీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభపడగా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎన్‌టీపీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. కానీ బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.