Page Loader
Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన

Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 19, 2024
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు 80 గంటలపాటు ఎయిర్ పోర్టులోనే చిక్కుకొన్నారు. నవంబర్ 16న 100 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానం మళ్లీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులు 80 గంటల పాటు ఫుకెట్‌లోని ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోవడం గమనార్హం. ఒక ప్రయాణికుడు తన అనుభవం గురించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఆరున్నర గంటలు ఎయిర్‌పోర్టులో వేచి ఉన్నామని, ఆ తర్వాత మరొక విమానం ఇచ్చి, టేకాఫ్ చేసిన రెండో గంటలోనే సాంకేతిక లోపం కారణంగా మళ్లీ ఫుకెట్‌లో ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందన్నారు.

Detailss

ప్రయాణికులకు ప్రత్యేక వసతులు అందజేశాం 

దీంతో చిన్నారులు, పెద్దలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాడు. ఈ అంశంపై ఎయిర్ ఇండియా స్పందించింది. టేకాఫ్ తర్వాత సాంకేతిక సమస్యలు కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రయాణికులకు వసతులు అందజేసి, కొందరిని గమ్యస్థానాలకు పంపించినట్లు పేర్కొంది. ఇంకా 40 మందిని మరికొన్ని గంటల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది.