Loading...
5G slicing service: 5జీ నెట్‌వర్క్‌ స్లైసింగ్‌ సేవల నాణ్యత నిబంధనలపై టెలికాం సంస్థల అభ్యంతరం
5జీ నెట్‌వర్క్‌ స్లైసింగ్‌ సేవల నాణ్యత నిబంధనలపై టెలికాం సంస్థల అభ్యంతరం

5G slicing service: 5జీ నెట్‌వర్క్‌ స్లైసింగ్‌ సేవల నాణ్యత నిబంధనలపై టెలికాం సంస్థల అభ్యంతరం

వ్రాసిన వారు Moogati Shabari
Sep 04, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

5జీ నెట్‌వర్క్‌ స్లైసింగ్‌ సేవల నాణ్యతకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) ప్రతిపాదించిన నిబంధనలను రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వ్యతిరేకించాయి. ఈ నిబంధనల వల్ల నెట్‌వర్క్‌ను అవసరానికి అనుగుణంగా వినియోగించుకునే వెసులుబాటు తగ్గుతుందని, కొత్త సాంకేతికతల ఆవిష్కరణకు ఆటంకం కలుగుతుందని, వ్యాపారం నిర్వహించడం మరింత కష్టమవుతుందని ఆయా సంస్థలు అభిప్రాయపడ్డాయి.

వివరాలు

సకాలంలో సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు..

గత నెలలో ట్రాయ్‌ 5జీ నెట్‌వర్క్‌ స్లైసింగ్‌కు సంబంధించి ముసాయిదా నాణ్యతా నిబంధనలను ప్రతిపాదించింది.

ఇందులో భాగంగా.. ఏదైనా 5జీ మొబైల్‌ సెల్‌ ఒక నెలలోని ఐదు రోజుల్లో పీక్‌ అవర్‌ సమయంలో 80 శాతానికి మించి లోడ్‌ అయితే.. టెలికాం సంస్థలు సకాలంలో సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఒక సర్వీస్‌ ఏరియాలో ఆపరేటర్‌ నెట్‌వర్క్‌లోని మొత్తం సెల్స్‌లో నెలకు 1 శాతానికి మించి ఈ రద్దీ పరిమితిని దాటకూడదని ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది.

వివరాలు

5జీ స్లైస్‌ను ప్రారంభించడానికి 21 రోజుల ముందుగానే ట్రాయ్‌కు సమాచారం ఇవ్వాల్సిందే..

ఒక సెల్‌లో ఏర్పడిన రద్దీని 30 రోజుల్లోపు తొలగించలేకపోతే.. ఆ యాంటెన్నాకు సంబంధించిన ప్రాధాన్య ఫాస్ట్‌-లేన్‌ 5జీ స్లైస్‌ సేవలను అప్‌గ్రేడ్‌ చేసే వరకు నిలిపివేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా కొత్త 5జీ స్లైస్‌ను ప్రారంభించే ముందు తమ వద్ద తగినంత నెట్‌వర్క్‌ సామర్థ్యం ఉందని టెలికాం సంస్థలు నిరూపించాలి.

అలాగే కొత్త 5జీ స్లైస్‌ను ప్రారంభించడానికి 21 రోజుల ముందుగానే ట్రాయ్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

5జీ స్లైసింగ్‌ ద్వారా ప్రత్యేకమైన, అధిక వేగంతో కూడిన నెట్‌వర్క్‌ లేన్లను ఏర్పాటు చేయవచ్చు.

అయితే 5జీ స్లైసింగ్‌ కారణంగా సాధారణ వినియోగదారులకు ఇంటర్నెట్‌ నాణ్యత తగ్గకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ట్రాయ్‌ ఈ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది.

ADVERTISEMENT

వివరాలు

ఆ రూల్స్ వ్యతిరేకించిన జియో..

అయితే ఈ నిబంధనలను రిలయన్స్‌ జియో తీవ్రంగా వ్యతిరేకించింది.

సెప్టెంబర్‌ 2న ముసాయిదా నాణ్యతా నిబంధనలపై స్పందిస్తూ.. ఈ తరహా తప్పనిసరి నిబంధన సమర్థవంతమైన స్పెక్ట్రమ్‌ వినియోగం, సాంకేతిక తటస్థత, వ్యాపారనిర్వహణను సులభతరం చేయాలన్న ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉంటుందని జియో పేర్కొంది.

అందువల్ల దీనిని అమలు చేయకూడదని కోరింది. ఒక సెల్‌లో వినియోగించే పీఆర్‌బీ (Physical Resource Block) పరిమాణం అనేది అంతర్గత రేడియో వనరుల కొలమానం మాత్రమేనని, అది నేరుగా వినియోగదారుల అనుభవాన్ని లేదా సేవా నాణ్యత తగ్గుదలను సూచించదని జియో తెలిపింది.

నెట్‌వర్క్‌ స్లైసింగ్‌ అనేది వేగంగా మారుతున్న సాంకేతిక సామర్థ్యమని, కొత్త తరహా, సంస్థల అవసరాలకు అనుగుణంగా రూపొందించే 5జీ సేవలతో ఇది ముడిపడి ఉంటుందని పేర్కొంది.

ADVERTISEMENT