LOADING...
Meta: మెటాలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
మెటాలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

Meta: మెటాలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2025
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా త్వరలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించనుంది. సోమవారం నుంచి గ్లోబల్ లేవల్లో ఈ తొలగింపులు అమలు కానున్నాయి. మెటా హెడ్‌ ఆఫ్‌ పీపుల్‌ జనెల్‌ గేలే ఈ విషయాన్ని ప్రకటించినట్లు రాయిటర్స్ పేర్కొంది. సోమవారం ఉదయం 5:00 గంటల నుంచి అమెరికా సహా అనేక దేశాల్లో ఉద్యోగులను ఈ విషయంపై అధికారికంగా సమాచారం అందించనున్నారు. ఈ తొలగింపుల ప్రభావం జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్‌లపై ఉండదని తెలుస్తోంది. ఈ దేశాల్లోని స్థానిక కార్మిక చట్టాల కారణంగా ఉద్యోగుల తొలగింపులు అమలులోకి రాకపోవచ్చు. అయితే, యూరప్‌, ఆసియా, ఆఫ్రికాలోని 12కు పైగా దేశాల్లో ఫిబ్రవరి 11 నుంచి 18 మధ్యలో ఉద్యోగులకు నోటిఫికేషన్లు అందే అవకాశముంది.

Details

మరోవైపు  బిజినెస్ క్రిటికల్ ఇంజినీరింగ్ రోల్స్‌ కోసం నియామకాలు

గత నెలలోనే మెటా తన సంస్థలో 5% మంది 'లోయెస్ట్‌ పెర్‌ఫార్మర్స్‌' ను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని స్పష్టం చేసింది. గేలే తాజా మెమోలో వీటిని "పర్ఫార్మెన్స్ టెర్మినేషన్లు"గా పేర్కొన్నారు. ఒక వైపు ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతుండగా, మరోవైపు మెటా మిషిన్ లెర్నింగ్ ఇంజినీర్లతో పాటు బిజినెస్ క్రిటికల్ ఇంజినీరింగ్ రోల్స్‌ కోసం వేగంగా హైరింగ్ ప్రక్రియను చేపట్టనుంది. మెటా వీపీ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ మానిటైజేషన్ పెంగ్ ఫాన్ షేర్ చేసిన మరో మెమో ప్రకారం, ఫిబ్రవరి 11 నుంచి మార్చి 13 మధ్య ఈ నియామకాలు చేపడతారని తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించేందుకు రాయిటర్స్‌ సంస్థ మెటాను సంప్రదించినా, కంపెనీ ప్రతినిధులు ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.