ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్
భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్‌కు చెందిన 1.4 బిలియన్ డాలర్ల వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. అంటే మొత్తం రూ.11.5వేల కోట్లకు తన తన వాటను వాల్‌మార్ట్‌కు టైగర్ గ్లోబల్ విక్రయించింది. అమెరికా రిటైల్ దిగ్గజమైన వాల్‌మార్ట్ 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో 72శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. వీలైనంత త్వరగా ఫ్లిప్‌కార్ట్‌ను ఐపీఓలోకి తీసుకురావాలని వాల్ మార్ట్ యోచిస్తోంది. ఈ క్రమంలో సంస్థలోని మొత్తం మాటాలను సొంతం చేసుకునే పనిలో నిమగ్నమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారులైన యాక్సెల్‌తో పాటు, టైగర్ గ్లోబల్ కూడా తమ మిగిలిన వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వాల్‌మార్ట్ రాకతో భారత ఈ-కామర్స్ మార్కెట్‍లో పోటీ
ఫ్లిప్‌కార్ట్‌లోని కీలక పెట్టుబడిదారుల్లో టైగర్ గ్లోబల్ కీలకంగా ఉంది. టైగర్ గ్లోబల్ కంపెనీ 2009లో 8.6 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టింది. 2010 -2015 మధ్య మరో 1.2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. 2017లో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్‌కు తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించింది. ఆ వాటాను విక్రయించడం ద్వారా దాదాపు 3.5 బిలియన్ డాలర్ల లాభాలను టైగర్ గ్లోబల్ ఆర్జించింది. ఇదిలా ఉంటే, వాల్‌మార్ట్ 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఏకైక భారతీయ స్టార్టప్ ఫ్లిప్‌కార్ట్ కావడం గమనార్హం. దీంతో వాల్‌మార్ట్ రాకతో భారత ఈ-కామర్స్ మార్కెట్‍లో పోటీ మరింత పెరగనుంది.