Unimech Aerospace: అరంగేట్రంలో అదరగొట్టిన యూనిమెక్ ఏరోస్పేస్ షేర్లు.. 90% ప్రీమియంతో లిస్టింగ్
ఈ వార్తాకథనం ఏంటి
యూనిమెక్ ఏరోస్పేస్ (Unimech Aerospace) షేర్లు మార్కెట్లో పెద్ద హంగామా సృష్టించాయి.
బీఎస్‌ఈలో రూ.1,460 వద్ద ప్రారంభమైన ఈ షేర్లు, ఇష్యూ ధర రూ.785తో పోలిస్తే 90 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.
ఈ షేర్లు బీఎస్ఈలో రూ.1491 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
2024 సంవత్సరం చివరిరోజున దలాల్ స్ట్రీట్‌లో లిస్ట్ అయిన ఈ షేర్లు మదుపర్లకు మంచి లాభాలను అందించాయి.
యూనిమెక్ ఏరోస్పేస్ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ధర శ్రేణి రూ.745-785 మధ్య నిర్ణయించగా, ప్రారంభ రోజు నుంచే బాగానే స్పందన వచ్చింది.
చివరి రోజు, మొత్తం 175.31 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.
వివరాలు
ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.250కోట్లు విలువైన షేర్లు జారీ
ఈ ఐపీఓలో భాగంగా,రూ.250కోట్లు విలువైన కొత్త షేర్లు,ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.250కోట్లు విలువైన షేర్లు జారీ చేయబడ్డాయి.
అలాగే,రూ.150 కోట్లు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ముందుగా సమీకరించబడిన విషయం గమనించదగింది. ఫలితంగా,ఈ షేర్లు 90శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.
పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణలో ఉపయోగించనుందని కంపెనీ పేర్కొంది.
బెంగళూరులో ఉన్న యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ ఏరోస్పేస్, ఎనర్జీ, సెమీ కండక్డ్టర్ రంగాలలో ప్రముఖ సంస్థగా ఎదిగింది.
ఏరో టూలింగ్, గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు,డిఫెన్స్, ఎనర్జీ వంటి కష్టమైన ఉత్పత్తుల తయారీ, సరఫరాలో ప్రత్యేకతను చూపింది.
మదుపర్లు లాభాలను పొందుతుండగా, షేర్లు 10:30 గంటల సమయానికి 6 శాతం క్షీణించి రూ.1,371 వద్ద ట్రేడవుతున్నాయి.