బడ్జెట్ 2023-24లో వేటి ధరలు పెరిగాయి, ఏవి తగ్గాయి
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి ఎటువంటి ప్రస్తావన లేదని విమర్శించిన ప్రతిపక్షాలు
ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రొయ్యల దాణాపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గించింది. చౌకగా మారే ఇతర వస్తువులలో లిథియం-అయాన్ బ్యాటరీల యంత్రాలు, ఎలక్టిక్ వెహికల్ (EV) పరిశ్రమకు అవసరమయ్యే ముడి పదార్థాలు ఉన్నాయి. ఇది ఎలక్ట్రానిక్ తయారీకి ఊతం ఇస్తుందని భావిస్తున్నారు. వస్త్రాలు, వ్యవసాయ వస్తువులపై ప్రాథమిక కస్టమ్-డ్యూటీ కూడా తగ్గింది. ఇమిటేషన్ నగలు, వెండి ఉత్పత్తులు, దిగుమతి చేసుకున్న సైకిళ్లు, దిగుమతి చేసుకున్న బొమ్మలు, దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2023-24 బడ్జెట్లో పెట్టుబడి రంగం, ఆరోగ్యం, గ్రీన్ ఎనర్జీపై బడ్జెట్ చాలా దృష్టి పెట్టింది. అయితే, బడ్జెట్‌లో గ్రామీణ పేదలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి ఎటువంటి ప్రస్తావన లేదని ప్రతిపక్ష నాయకుల విమర్శించారు.