NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మహేష్ బాబు 28వ సినిమా తప్పుకుంటే రవితేజ సినిమాకు లాభం?
    తదుపరి వార్తా కథనం
    మహేష్ బాబు 28వ సినిమా తప్పుకుంటే రవితేజ సినిమాకు లాభం?
    ఆగస్టు 11న తలపడనున్న మహేష్, రవితేజ

    మహేష్ బాబు 28వ సినిమా తప్పుకుంటే రవితేజ సినిమాకు లాభం?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 23, 2023
    06:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 28వ సినిమా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో జరుగుతుందని వార్తలు వచ్చాయి.

    నిజానికి ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా అయిపోవాల్సింది. కానీ త్రివిక్రమ్ రాసుకున్న కథకు మహేష్ కొన్ని మార్పులు సూచించాడని, అదీగాక ఫైట్ మాస్టర్ లను మార్చేశారని, అందువల్లే సినిమా షూటింగ్ ఆలస్యంగా మొదలైందని వినిపించింది.

    షూటింగ్ ఆలస్యంగా మొదలు కావడం వల్ల దాని ప్రభావం రిలీజ్ మీద కూడా పడనుందని తెలుస్తోంది. ఒకవేళ మహేష్ బాబు 28వ సినిమా అనుకున్నట్లుగా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కాకపోతే మాస్ మహారాజు రవితేజకు ప్లస్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది

    రవితేజ

    టైగర్ నాగేశ్వర రావుతో వస్తున్న రవితేజ

    మహేష్ బాబు సినిమా లేట్ అయితే రవితేజకు సోలో రిలీజ్ దొరికే అవకాశం ఉంది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాడు.

    ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. రవితేజ కెరీర్లో ఇది మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం.

    రెండు పెద్ద చిత్రాలు ఒకేరోజున రిలీజైతే బాక్సాఫీసు కలెక్షన్ల మీద ప్రభావం పడుతుంది. ఐతే మహేష్ 28వ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.

    మరి మహేష్ బాబు సినిమా, దసరాకి లేదా సంక్రాంతికి వాయిదా పడి టైగర్ నాగేశ్వరరావుకు కలిసి వచ్చేలా చేస్తుందా అనేది చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా రిలీజ్

    తాజా

    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్
    Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌! కమల్ హాసన్

    సినిమా రిలీజ్

    నాకు ఆ టైమ్ ఇప్పుడే వచ్చింది.. హిందీ సినిమాపై నయనతార కామెంట్స్ సినిమా
    అవెంజర్ యాక్టర్ కి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం టాలీవుడ్
    రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లోకి ఎంటరైన కళ్యాణం కమనీయం? సినిమా
    మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మూడో హిట్ గా కళ్యాణ్ రామ్ చిత్రం నిలవనుందా? తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025