మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ?
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే సారధి స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభమయ్యింది.
షూటింగ్ లోంచి బయటకు వచ్చిన లీకులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. మిగతా కీలక పాత్రల్లో ఎవరు చేస్తున్నారనేది ఇంకా బయటకు రాలేదు.
తాజాగా విలన్ విషయంలో ఒక వార్త బయటకు వచ్చింది. ఖైదీ, విక్రమ్ సినిమాల్లో విలన్ గా మెప్పించిన అర్జున్ దాస్, మహేష్ బాబు 28వ సినిమాలో విలన్ గా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.
ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు కానీ, అర్జున్ దాస్ అయితే విలన్ గా సరిగ్గా సరిపోతారని త్రివిక్రమ్ భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు 28వ సినిమా
ఆక్సిజన్ సినిమాతో పరిచయమైన అర్జున్ దాస్
తమిళ చిత్రాలైన ఖైదీ, విక్రమ్ సినిమాతో అర్జున్ దాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అతని గంభీరమైన గొంతు ఎక్కువ మందిని ఆకర్షించింది. మహేష్ బాబు సినిమాలో విలన్ గా అర్జున్ దాస్ చేస్తే అది అతనికి మూడవ తెలుగు సినిమా అవుతుంది.
మొదటగా గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ సినిమాలో దర్శనమిచ్చాడు అర్జున్ దాస్. ఆ తర్వాత బుట్టబొమ్మ సినిమాతో మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బుట్టబొమ్మ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది.
ఇదిలా ఉంటే, మహేష్ బాబు 28వ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.