NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి తలనొప్పిగా మారిన అమీర్ పేట్ మెట్రో
    తదుపరి వార్తా కథనం
    మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి తలనొప్పిగా మారిన అమీర్ పేట్ మెట్రో
    మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలకు తలనొప్పిగా మెట్రో లైన్

    మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి తలనొప్పిగా మారిన అమీర్ పేట్ మెట్రో

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 20, 2023
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎలాంటి హంగామా లేకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. యాక్షన్ సీన్స్ కోసం ఫైట్ మాస్టర్ ను మార్చి చిత్రీకరిస్తున్నారు.

    అలాగే సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు సమానంగా ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ ఉండేలా స్క్రిప్ట్ లో మార్పులు తెచ్చారని, ఆ తర్వాతే సినిమా షూటింగ్ మొదలైందని టాక్.

    ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో వేసిన ఒక సెట్ లో జరుగుతోంది. షూటింగ్ లొకేషన్ నుండి హీరోయిన్ పూజాహెగ్డే చిత్రాలు కొన్ని బయటకు వచ్చాయి.

    అది పెద్ద విషయం కాదు కానీ, షూటింగ్ సెట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి.

    మహేష్ బాబు

    అమీర్ పేట్ మెట్రో వల్లే లీక్ అవుతున్న వీడియోలు

    మహేష్ 28 మూవీ కోసం ఒక చిన్న పెల్లెటూరు లాంటి సెట్ వేసారట. సారధి స్టూడియోకి దగ్గర్లోనే అమీర్ పేట్ మెట్రో లైన్ ఉంటుంది.

    మెట్రో లైన్ ఎత్తులో ఉంటుంది కాబట్టి మహేష్ 28 సినిమా కోసం వేసిన సెట్ క్లియర్ గా కనిపిస్తుందట. దాంతో స్టేషన్ లోని జనాలు ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.

    ఈ విషయం త్రివిక్రమ్ కి తలనొప్పిగా మారింది. ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తున్నారట. షూట్ కి సంబంధించిన వీడియోలు ఎక్కువగా లీక్ అయితే సినిమా మీద ఆసక్తి తగ్గుతుందేమోనని భయపడుతున్నారు.

    ఈ విషయంలో త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన టాలీవుడ్
    దూసుకుపోతున్న బాలయ్య వీరసింహారెడ్డి.. క్రేజీ రికార్డ్ దిశగా పయనం సినిమా
    మెగాస్టార్ చిరంజీవి చేతిలో మరో సినిమా.. ప్రభుదేవాకు అవకాశం? చిరంజీవి
    ఫిబ్రవరిలో తెలుగు తెర మీద చిన్న సినిమాల సందడి టాలీవుడ్

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025