Loading...
Kolkata Durga Puja Stampede: కోల్‌కతాలో దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి?
కోల్‌కతాలో దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి?

Kolkata Durga Puja Stampede: కోల్‌కతాలో దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2026
10:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజా ఉత్సవాల వేళ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని చోరేబాగన్‌ సార్వజనీన దుర్గా పూజా మండపం వద్ద శనివారం భారీగా జనం గుమిగూడటంతో తొక్కిసలాటను తలపించే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు అస్వస్థతకు గురికాగా, కొందరిని ఆసుపత్రికి తరలించారు. తాజా నివేదికల ప్రకారం, ఈ ఘటనలో 17 మంది మరణించినట్లు సమాచారం.

వివరాలు

భారీగా తరలివచ్చిన భక్తులు

దుర్గా పూజను వీక్షించేందుకు శనివారం సాయంత్రం చోరేబాగన్‌ పూజా మండపానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు చేరుకున్నారు.

దీంతో అక్కడ జనసందోహం పెరిగింది. రద్దీ కారణంగా పలువురు అస్వస్థతకు గురై కిందపడిపోయినట్లు సమాచారం.

ఈ పరిణామంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది.

ADVERTISEMENT