NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బుట్టబొమ్మ సినిమాకు రివ్యూ ఇచ్చిన డీజే టిల్లు ఫేమ్ సిద్ధు
    తదుపరి వార్తా కథనం
    బుట్టబొమ్మ సినిమాకు రివ్యూ ఇచ్చిన డీజే టిల్లు ఫేమ్ సిద్ధు
    బుట్టబొమ్మ సినిమాకు డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ రివ్యూ

    బుట్టబొమ్మ సినిమాకు రివ్యూ ఇచ్చిన డీజే టిల్లు ఫేమ్ సిద్ధు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 03, 2023
    01:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మళయాల మూవీ కప్పెలా సినిమాకు తెలుగు రీమేక్ గా వస్తున్న సినిమా బుట్టబొమ్మ. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

    ఈ ఈవెంట్ కి డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ అతిధిగా వచ్చారు. సిద్ధు కెరీర్లో అతిపెద్ద సక్సెస్ అందుకున్న డీజే టిల్లు సినిమాకు నిర్మాతగా ఉన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే బుట్టబొమ్మ కూడా తెరకెక్కింది.

    ఈవెంట్ లో మాట్లాడిన సిద్ధు, సితార బ్యానర్ తనకు సొంత సంస్థ లాంటిదనీ, మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో సితార ఎంతర్ టైన్మెంట్స్ ముందుంటుందని చెప్పుకొచ్చాడు.

    అలాగే బుట్టబొమ్మ సినిమా గురించి రివ్యూ కూడా చెప్పేసాడు.

    తెలుగు సినిమా

    బుట్టబొమ్మ సినిమాలో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి

    బుట్టబొమ్మ చాలా బాగా వచ్చిందనీ, లవ్,యాక్షన్, మలుపులు కలగలిపి సినిమా అద్భుతంగా ఉంటుందని హామీ ఇచ్చేసాడు.

    మంచి రొమాన్స్, లవ్ ఉంటూనే డేంజరస్ మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయని, థ్రిల్ ఫీలవుతారని, ఇందులో అన్ని ఎమోషన్ ఉన్నాయని చెప్పాడు.

    ఇంకా ఇందులో నటించిన హీరోయిన్ అనికా సురేంద్రన్, హీరో సూర్య వశిష్ట, ప్రధాన పాత్రలో కనిపించే అర్జున్ దాస్, నవ్యస్వామి మొదలగు వారందరినీ అభినందించాడు.

    సితార ఎంటర్ టైన్మెంట్స్ తో పాటు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంది. షోరీ చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహించగా గోపీసుందర్ మ్యూజిక్ అందించారు.

    మరి ఈ రీమేక్ తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలుగు సినిమా

    వాల్తేరు వీరయ్య: హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు పెరుగుతున్న థియేటర్లు వాల్తేరు వీరయ్య
    ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ పై ఆసక్తికర అప్డేట్ సినిమా
    మహేష్ బాబు 28: ఫైట్ మాస్టర్లను మార్చేసి షూటింగ్ మొదలుపెడుతున్న త్రివిక్రమ్ సినిమా
    వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో వస్తున్న సినిమా నుండి సరికొత్త అప్డేట్ సినిమా

    సినిమా రిలీజ్

    నాకు ఆ టైమ్ ఇప్పుడే వచ్చింది.. హిందీ సినిమాపై నయనతార కామెంట్స్ సినిమా
    అవెంజర్ యాక్టర్ కి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం టాలీవుడ్
    రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లోకి ఎంటరైన కళ్యాణం కమనీయం? సినిమా
    మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మూడో హిట్ గా కళ్యాణ్ రామ్ చిత్రం నిలవనుందా? తెలుగు సినిమా

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025