సరికొత్త కథలతో థియేటర్లను షేక్ చేయడానికి రెడీ అవుతున్న ఈ వారం సినిమాలు
సంక్రాంతి తర్వాత వేసవి వచ్చే వరకు తెలుగు సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా సందడి ఉండదు. పెద్ద సినిమాలు లేకపోవడమే దానికి కారణం. ఐతే ఈసారి మాత్రం వేసవికి ముందే థియేటర్లు షేక్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ ఫిబ్రవరిలో థియేటర్లలోకి వరుసపెట్టి సినిమాలు రానున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా సినిమాలుయ్ ఫిబ్రవరిలో విడుదలవుతున్నాయి. వీటన్నింటిలో ప్రతీ సినిమాకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మొదటి వారంలో రిలీజ్ అవుతున్న రైటర్ పద్మభూషణ్, మైఖేల్, బుట్టబొమ్మ చిత్రాలను చూసుకుంటే ప్రతీదీ ఆసక్తికరంగానే ఉంది. యాక్టర్ సుహాస్ హీరోగా రూపొందిన రైటర్ పద్మభూషణ్ సినిమాను, రిలీజ్ కి ముందే ప్రివ్యూల ద్వారా కొంతమందికి చూపించారు.
80ల నాటి కథతో పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న సందీప్ కిషన్
రైటర్ పద్మభూణ్ సినిమాకు ప్రివ్యూ షోల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ ఛాయ్ బిస్కట్ ఫిలిమ్స్ కూడా ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉంది. ఇకపోతే ఈరోజు విడుదలవుతున్న మరో సినిమా, మైఖేల్. సందీప్ కిషన్ పాన్ ఇండియా రేంజ్ లో దీన్ని తీసుకొచ్చాడు. 80ల నాటి కథ, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనలు కూడా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. చివరగా ఈ వారం రిలీజ్ అవుతోన్న మరో మూవీ బుట్టబొమ్మ. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షించింది. మరి ఈ మూడింటిలో ఏ సినిమాకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుందో చూడాలి.