
బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ
ఈ వార్తాకథనం ఏంటి
సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న బుట్టబొమ్మ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. అనికా సురేంద్ర, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్యస్వామి ప్రధాన పాత్రల్లో కనిపించారు.
ట్రైలర్ మొదట్లో అనికా సురేంద్రన్ కి తెలియని నంబర్ నుండి కాల్ వస్తుంది. మొదట్లో పేరు చెప్పడానికి భయపడిన అనికా పాత్ర, ఆ తర్వాత ఆ కాలర్ సూర్యవశిష్ట తో ప్రేమలో పడినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
ఇటువైపేమో సూర్యది ఆటో డ్రైవర్ పాత్ర. ఇక అనికా పాత్ర వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ అన్నట్లుగా చూపించారు. నాన్నను కాదని ఎవరో తెలియని ఆటో డ్రైవర్ తో వెళ్ళిపోవడానికి అనికా పాత్ర సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
బుట్టబొమ్మ ట్రైలర్ టాక్
మలుపులతో కూడిన బుట్టబొమ్మ ప్రేమకథ
ఈ ప్రేమికుల మధ్యలోకి అర్జున్ దాస్ పాత్ర వచ్చినట్లు చూపించారు. మరి ఎందుకు వస్తాడు? ఏం జరిగిందనే విషయాలు సినిమా చూస్తే అర్థమవుతాయని చెప్పకనే చెప్పారు.
అర్జున్ దాస్ పాత్ర ఎంటర్ అయిన తర్వాత కథలో మలుపులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. చూస్తుంటే మంచి ఇంట్రెస్టింగ్ కథతో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
అనికా సురేంద్రన్ చాలా అందంగా కనిపించింది. అర్జున్ దాస్ ఎప్పటిలాగే విలన్ లుక్ తో ఉన్నాడు. బుట్టబొమ్మ సినిమాను శౌరీ చంద్రశేఖర్ టీ రమేష్ డైరెక్ట్ చేసారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు.
నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంట్రెస్టింగ్ గా "బుట్టబొమ్మ" ట్రైలర్.!
Theatrical Trailer of the Bittersweet Tale of Adolescence love, #ButtaBomma is here!💌
— Sithara Entertainments (@SitharaEnts) January 28, 2023
▶️ https://t.co/PA11glvzPe
Launched by our Mass ka Das @VishwakSenActor 🤩#AnikhaSurendran @iam_arjundas #suryavashistta @shourie_t @NavinNooli @vamsi84 #SaiSoujanya @ganeshravuri pic.twitter.com/LZh5QUYsTZ