
మైఖేల్ ట్రైలర్ టాక్: ఈ భూమ్మీద అమ్మాయే కోసమే బతకాలంటున్న సందీప్ కిషన్
ఈ వార్తాకథనం ఏంటి
సందీప్ కిషన్, దివ్యాన్ష కౌషిక్ హీరో హీరోయిన్లుగా నటించిన మైఖేల్ ట్రైలర్ విడుదలైంది. 2నిమిషాల 11సెకన్ల ట్రైలర్ లో ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి.
ట్రైలర్ మొత్తం యాక్షన్ అంశాలతో నిండిపోయింది. ఫైట్ సీక్వెన్సెస్ చాలానే ఉన్నాయని అర్థం అవుతోంది. ట్రైలర్ లో వినిపించిన కొన్ని డైలాగులు అద్భుతంగా ఉన్నాయి.
"అవసరం తీరాక ఆడ స్పైడర్, మగ స్పైడర్ ని చంపేస్తుంది తెలుసా" అని గౌతమ్ మీనన్ పలికిన డైలాగ్స్ చూస్తుంటే ఈ సినిమాలో లేడీ విలన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రైలర్ మొత్తంలో పవర్ ఫుల్ డైలాగ్స్ చాలా కనిపించాయి. "నిప్పు వెలుగుతో ఆకర్షిస్తుంది, కానీ దగ్గరికెళితే వేడితో కాల్చేస్తుంది" లాంటి పదునైన మాటలు ఆకట్టుకున్నాయి.
సందీప్ కిషన్
ప్రత్యేక ఆకర్షణగా విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్
విజయ్ సేతుపతి రోల్ గురించి ఎక్కువగా రివీల్ చేయలేదు కానీ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది. అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలు శక్తివంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
వరుణ్ సందేశ్ చాలా విభిన్నమైన గెటప్ లో దర్శనమిచ్చాడు. చూస్తుంటే పూర్తి యాక్షన్ సినిమాగా అనిపించినా, ట్రైలర్ చివర్లో దివ్యాన్ష్ కౌషిక్, సందీప్ కిషన్ ల రొమాన్స్, ఈ సినిమాలో మంచి లవ్ సీన్స్ ఉన్నాయని తెలియజేస్తుంది.
ఇక చివర్లో, "అమ్మాయి కోసం బతక్కపోతే ఎందుకు సార్ బతకడం" అనే మాటలు, కథలోని ముఖ్యమైన పాయింట్ అమ్మాయిలే అని సూచిస్తున్నాయి.
పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న మైఖేల్ సినిమాను రంజిత్ జెయకోడి డైరెక్ట్ చేసారు. ఫిబ్రవరి 3వ తేదీన రిలీజ్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భూమ్మీద అమ్మాయే కోసమే బతకాలంటున్న సందీప్ కిషన్
Oka Ammayi Kosam Kakapothe Enduku Sir Manishi Brathakali..
— Sundeep MICHAEL-Feb 3rd Kishan (@sundeepkishan) January 23, 2023
Dedicating #Michael trailer to every Man who’s Fought Hard Lost in Love 🖤
A @jeranjit Film ..https://t.co/l0gEL2QPHe@VijaySethuOffl @varusarath5 @Divyanshaaaaaa @menongautham @SamCSmusic @SVCLLP @KaranCoffl pic.twitter.com/GmYKUaNnx1