Spirit movie release date: ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. 'స్పిరిట్' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్' (Spirit Movie). ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ భారీ అప్డేట్ వెలువడింది. చిత్ర విడుదల తేదీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ను విడుదల చేయడంతో సినిమా రిలీజ్ డేట్పై స్పష్టత వచ్చింది.
వివరాలు
2027 దీపావళికి 'స్పిరిట్' విడుదల
గతంలో 'స్పిరిట్' సినిమాను 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు. తాజా ప్రకటన ప్రకారం.. ఈ చిత్రాన్ని 2027 అక్టోబర్ 29న దీపావళి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
వివరాలు
పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్.. తొమ్మిది భాషల్లో విడుదల
'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల చేయనున్నారు.
గుల్షన్ కుమార్ సమర్పణలో టీ-సిరీస్ (T-Series), భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా విడుదల తేదీని ప్రకటించడంతో 'స్పిరిట్' ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.