Shambala: ఆది సాయి కుమార్ బర్త్ డే.. 'శంబాల' పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
వర్సటైల్ యాక్టర్ సాయికుమార్ కుమారుడు ఆది సాయికుమార్ సుదీర్ఘకాలంగా సరైన విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త తరహా కథలను ఎంచుకుంటూ వెరైటీ ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన "శంబాల" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు, ఇది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ పోస్టర్‌లో మండుతున్న పొలాల మధ్య సైకిల్ తొక్కుతూ వచ్చిన ఆది సాయికుమార్, తన తడాఖా లుక్‌తో ఆసక్తిని రేకెత్తించారు. ఈ పోస్టర్ సినిమాకు సంబంధించిన కథ, ఆది పాత్రపై ఆసక్తిని పెంచుతోంది.
మిస్టిక్ వరల్డ్‌లో 'శంబాల'
ప్రస్తుతం ప్రేక్షకులు వాస్తవానికి దూరంగా, మిస్టిక్ వరల్డ్ నేపథ్యంలో జరిగే కథలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 'శంబాల' సినిమా కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన మిస్టిక్ వరల్డ్‌లో సాగుతుంది. పోస్టర్ ద్వారా దర్శకుడు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే సంకేతాలను ఇచ్చాడు. ఈ కథలో ఉత్కంఠభరితమైన థ్రిల్ల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ పాత్రలో నటిస్తుండగా, అతని డిసిప్లిన్, డెడికేషన్‌తో ఈ పాత్రను ప్రత్యేకంగా చేస్తారు. తెలుగు, తమిళ భాషల్లో విజయాలు అందుకున్న ఆనంది, ఈ చిత్రంలో ఆది సరసన నటిస్తున్నారు.
హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో "శంబాల"
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని డిఫరెంట్ స్టోరీలైన్‌ను అందించనుంది. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో దర్శకుడు యుగంధర్ "శంబాల"ను అత్యుత్తమంగా రూపొందిస్తున్నారు. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో శిక్షణ పొందిన ఆయన, గ్రాండ్ విజువల్స్, టాప్-క్లాస్ టెక్నికల్ అంచనాలతో సినిమాను తెరపైకి తీసుకువస్తున్నారు. నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు ,మహిధర్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం భారీ ఖర్చులు చేసి, అత్యుత్తమ ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను రూపుదిద్దుతున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.