
విషాదం: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ సూసైడ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఎంతో ప్రతిభ ఉన్న యంగ్ యాక్టర్ సుధీర్ వర్మ, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్ని గంటల క్రితమే తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
నటుడిగా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సుధీర్ వర్మ, అమాంతం అంతులేని లోకాలకు వెళ్ళిపోయాడు. విశాఖపట్నంలో తన నివాసంలో ఈ ఘటన జరిగిందని సమాచారం.
ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న దాని ప్రకారం, వ్యక్తిగత సమస్యలే ఆత్యహత్యకు దారి తీసి ఉంటాయని చెప్పుకుంటున్నారు
సుధీర్ వర్మ, కుందనపు బొమ్మ అనే సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఫస్ట్ హీరోగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్, సుధాకర్ కోమాకుల కనిపించారు.
తెలుగు సినిమా
ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపిన హీరో సుధాకర్ కోమాకుల
కుందనపు బొమ్మ తో పాటు సెకండ్ హ్యాండ్ అనే సినిమాలోనూ మెరిసాడు సుధీర్. అలాగే జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న "షూట్ అవుట్ ఆఫ్ ఆలేరు" అనే సిరీస్ లో ప్రముఖ పాత్రలో కనిపించాడు. ఈ సిరీస్ లో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందినీ రాయ్ నటించారు
సినిమా రంగంలో ఎంతో భవిష్యత్తు ఉన్న సుధీర్, సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడంతో స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పాయిజన్ తీసుకుని ప్రాణం తీసుకోవడంతో షాక్ అవుతున్నారు.
సుధీర్ మరణ వార్త బయటకు వచ్చాక ట్విట్టర్ వేదికగా స్పందించిన హీరో సుధాకర్, సుధీర్ చాలా మంచివాడని, అతన్ని కలవడం, అతనితో పనిచేయడం మంచి అనుభవమని చెప్పి, సుధీర్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ట్వీట్ చేసాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సుధీర్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ట్వీట్
Sudheer! @sudheervarmak Such a lovely and warm guy’ It was great knowing you and working with you brother! Can’t digest the fact that you are no more! Om Shanti!🙏🙏🙏 @iChandiniC @vara_mullapudi @anil_anilbhanu pic.twitter.com/Sw7KdTRkpG
— Sudhakar Komakula (@UrsSudhakarK) January 23, 2023