Loading...
Suriya 49: సూర్య 49లో అక్కినేని నాగార్జున.. విలన్‌గా ఫిక్స్ అయ్యారా?
సూర్య 49లో అక్కినేని నాగార్జున.. విలన్‌గా ఫిక్స్ అయ్యారా?

Suriya 49: సూర్య 49లో అక్కినేని నాగార్జున.. విలన్‌గా ఫిక్స్ అయ్యారా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'సూర్య 49'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్‌గా కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. హెచ్. వినోద్ చెప్పిన కథ, తన పాత్ర నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న 'సూర్య 49'లో సూర్యకు ధీటుగా ఉండేలా విలన్ పాత్రను దర్శకుడు హెచ్. వినోద్ డిజైన్ చేసినట్లు సమాచారం.

వివరాలు

తెలుగు మార్కెట్ లోనూ మంచి క్రేజ్

ఈ పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారని.. ఆయనకు కథ బాగా నచ్చడంతో సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది.

నాగార్జునలాంటి సీనియర్ స్టార్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే.. తమిళంతో పాటు తెలుగు మార్కెట్‌లోనూ సినిమాకు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

అయితే నాగార్జునతో చర్చలు ఇంకా పూర్తిగా ముగియలేదని.. అందుకే మేకర్స్ ఆయన పేరును అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది.

వివరాలు

మరోసారి విలన్‌గా నాగార్జున.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

నాగార్జున విలన్‌గా నటిస్తారనే వార్తపై అభిమానుల్లో మాత్రం భిన్నమైన స్పందన కనిపిస్తోంది. గతేడాది రజనీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' సినిమాలో నాగార్జున ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.

ఆ సినిమాలో నాగార్జున లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ.. ఆయన పాత్రకు తగినంత బలం లేదని కొందరు అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

నాగార్జున స్థాయి హీరోకు మరింత పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉండాల్సిందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు.

ఇప్పుడు మరోసారి నాగార్జున విలన్ పాత్రలో కనిపిస్తారనే వార్త రావడంతో.. ఈసారి అయినా ఆయనకు పవర్‌ఫుల్ రోల్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ADVERTISEMENT

వివరాలు

హీరోయిన్‌గా వామికా గబ్బి?

ఇక 'సూర్య 49'లో హీరోయిన్ పాత్ర కోసం 'డీసీ' ఫేమ్ వామికా గబ్బిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సూర్య, నాగార్జున, వామికా గబ్బి కాంబినేషన్ నిజమైతే ఈ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి హైప్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

'సూర్య 49'ను సూర్య, జ్యోతికలకు చెందిన జాగరం స్టూడియోస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం కథ, నటీనటుల ఎంపికతో పాటు ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

'కింగ్ 100'తో నాగార్జున బిజీ

మరోవైపు నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా 'కింగ్ 100'తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో టబు, సుష్మిత భట్, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

'కింగ్ 100' చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వివరాలు

వరుస సినిమాలతో సూర్య

మరోవైపు సూర్య కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆయన 47వ సినిమా షూటింగ్ పూర్తయింది.

ఈ మూవీ దీపావళికి విడుదల కానుంది. అలాగే 'జై భీమ్' దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌తోనూ సూర్య ఓ సినిమా చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సూర్య 49' కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఇక 'సూర్య 49'లో నాగార్జున నటించనున్నారనే వార్త నిజమైతే మాత్రం.. ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

ADVERTISEMENT