Loading...
Allari Naresh Alcohol Movie: అల్లరి నరేష్‌ ఆల్కాహాల్‌ రెడీ...సత్యతో కలిసి కామెడీ
అల్లరి నరేష్‌ ఆల్కాహాల్‌ రెడీ...సత్యతో కలిసి కామెడీ

Allari Naresh Alcohol Movie: అల్లరి నరేష్‌ ఆల్కాహాల్‌ రెడీ...సత్యతో కలిసి కామెడీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 12, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాస్యానికి కేరాఫ్‌గా నిలిచే అల్లరి నరేష్‌ మరోసారి తనదైన కామెడీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న యాక్షన్‌ కామెడీ చిత్రం 'ఆల్కహాల్‌' విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 18న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా రిలీజ్‌ డేట్‌ ప్రకటనతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

Details

మద్యానికి దూరంగా ఉండే వ్యక్తిగా నరేష్

ఈ సినిమాలో అల్లరి నరేష్‌ పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోంది. సాధారణంగా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే సమయంలో మద్యం ప్రస్తావన రావడం సహజం.

కానీ నరేష్‌ మాత్రం దానికి పూర్తిగా దూరంగా ఉండే వ్యక్తిగా కనిపిస్తున్నారు. టీజర్‌లో సత్యతో ఆయన చేసే సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి.

లక్షలు సంపాదిస్తున్నా మద్యం ఎందుకు తాగవని సత్య అడిగితే.. సంపాదనకు, మద్యం తాగడానికి సంబంధమేంటని నరేష్‌ ఎదురు ప్రశ్నించడం ఆకట్టుకుంటుంది.

తాగితే తనపై తనకే నియంత్రణ ఉండదని, మద్యం తనను శాసించడం ఇష్టం లేదని చెప్పే డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Details

సత్య కామెడీ టైమింగ్‌ మరో హైలైట్

చివర్లో సత్య తాను మద్యం మానేశానని చెప్పడం, అందుకు నరేష్‌ ఇచ్చే సమాధానం టీజర్‌లో మరో నవ్వుల సన్నివేశంగా నిలిచింది.

మెహర్‌ తేజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుహానీ శర్మ, నిహారిక ఎన్‌ఎం కథానాయికలుగా నటిస్తున్నారు.

సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. గిరీశ్‌ కులకర్ణి, హర్షవర్ధన్‌, రఘుబాబు, హరితేజ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

ADVERTISEMENT

Details

భారీ సాంకేతిక బృందంతో సినిమా

గిబ్రాన్‌ సంగీతం అందిస్తుండగా, చైతన్‌ భరద్వాజ్‌ నేపథ్య సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, నిరంజన్‌ దేవరమనే ఎడిటింగ్‌ బాధ్యతలు చేపట్టారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.

శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న 'ఆల్కహాల్‌'తో అల్లరి నరేష్‌ ఎలాంటి వినోదాన్ని అందిస్తారో చూడాలి.

ముఖ్యంగా నరేష్‌, సత్య కాంబినేషన్‌ థియేటర్లలో ఏ స్థాయిలో నవ్వులు పంచుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT