Dharsha Gupta : అసభ్యకర కంటెంట్ ఆరోపణలు.. నటి దర్షా గుప్తాతో పాటు పలువురిపై కేసులు!
ఈ వార్తాకథనం ఏంటి
గ్లామర్ నటి దర్జా గుప్తా (Dharsha Gupta)తో పాటు మరికొందరిపై సేలం (Salem) జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) కేసులు నమోదు చేశారు. సేలంకు చెందిన అజిత్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు అజిత్ ఇచ్చిన ఫిర్యాదులో పలువురు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్టు చేస్తున్నారని ఆరోపించారు. దర్జా గుప్తా, తిరుచ్చి సాదన, సూర్య ప్రభ, హనీ చెన్నై, అభినయ చిత్ర, ప్రియాంకా రాజ్, శరణ్య, యూట్యూబ్‌లో ఐశ్వర్య శివ, దివి తిలగవతి, దీపా కరూర్, సింద్ శేఖర్ వంటి పలువురు సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
వివరాలు
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
వీరు 18 ఏళ్లలోపు యువతీ యువకులకు హాని కలిగే విధంగా పోస్టులు పెడుతున్నారని, అలాగే కొన్ని అసభ్యకర వీడియోలను షేర్ చేస్తున్నారని అజిత్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.
అజిత్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.