
ఊర్వశివో రాక్షసివో తర్వాత కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్, తన కొత్త సినిమాపై అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసాడు.
ఈ పోస్టర్ లో మెట్రో ట్రైన్ లో అటువైపు తిరిగి నిల్చున్నాడు శిరీష్. శిరీష్ పక్కనే టెడ్డీ బేర్ ఉంది. టెడ్డీ బేర్ ని తన కో-స్టార్ గా చెప్పుకొచ్చాడు.
అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను ఈరోజు సాయంత్రం 4:05గంటలకు రిలీజ్ చేస్తానని ప్రకటించాడు.
మరి ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు, హీరోయిన్ గా ఎవరు చేయనున్నారు, ఏ నిర్మాణ సంస్థ తెరకెక్కించనుందనే విషయాలు ఈరోజు సాయంత్రం తెలుస్తుంది.
అల్లు శిరీష్ లాస్ట్ చిత్రం ఊర్వశివో రాక్షసివో బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అల్లు శిరీష్ కొత్త సినిమాపై అప్డేట్
Me & my co-star from my next film! Will be sharing the first look & glimpse tomorrow, 30th May at 4:05pm. Stay tuned! ♥️ pic.twitter.com/GBXDTxpWpN
— Allu Sirish (@AlluSirish) May 29, 2023