Chand Mera Dil: అనన్య పాండ్యా మూవీకి సెన్సార్ దెబ్బ.. 10 సెకన్ల లిప్‌లాక్ సీన్ కట్!
ఈ వార్తాకథనం ఏంటి
వివేక్ సోని దర్శకత్వంలో కరణ్ జోహర్ నిర్మించిన బాలీవుడ్ మూవీ 'చాంద్ మేరా దిల్' యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ నటుడు లక్ష్య, బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండ్యా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా లక్ష్య - అనన్యా మధ్య చూపించిన రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే, సినిమాలో రొమాన్స్ డోస్ మరీ ఎక్కువైందంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చిత్రంలోని పలు ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు కత్తెర వేసింది.
వివరాలు
మరికొన్ని సీన్స్ ట్రిమ్
ఈ మార్పుల అనంతరం చిత్రానికి UA 16+ సర్టిఫికేట్ మంజూరు చేశారు. ప్రముఖ బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, సినిమాలో హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే అత్యంత సన్నిహిత సన్నివేశాలను సెన్సార్ సభ్యులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఇందులో భాగంగా 10 సెకన్ల పాటు కొనసాగే ఓ లిప్-లాక్ సీన్‌ను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఆ సన్నివేశానికి బదులుగా కథనానికి ఇబ్బంది కలగని ప్రత్యామ్నాయ విజువల్స్ ఉపయోగించాలని సూచించినట్లు సమాచారం. ఇదే కాకుండా, సినిమా మొత్తం మీద వేర్వేరు సందర్భాల్లో వచ్చే మరికొన్ని ఘాటైన లిప్-లాక్ సన్నివేశాలను కూడా ట్రిమ్ చేశారు.
వివరాలు
సినిమా రన్‌టైమ్ కూడా తగ్గింపు
దాదాపు 1 నిమిషం 26 సెకన్ల నిడివి గల రొమాంటిక్ కంటెంట్‌ను కత్తిరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే సుమారు 96 సెకన్ల మేర రొమాంటిక్ సన్నివేశాలకు సెన్సార్ బోర్డు చెక్ పెట్టినట్లైంది. ఈ భారీ సెన్సార్ కట్స్ అనంతరం సినిమా రన్‌టైమ్ కూడా తగ్గింది. అన్ని మార్పులు పూర్తి చేసుకున్న 'చంద్ మేరా దిల్' చిత్రం ఇప్పుడు 135.36 నిమిషాల నిడివితో, అంటే సుమారు 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.