Page Loader
Laapataa Ladies: 'లాపతా లేడీస్‌'కు మరో అంతర్జాతీయ గుర్తింపు
'లాపతా లేడీస్‌'కు మరో అంతర్జాతీయ గుర్తింపు

Laapataa Ladies: 'లాపతా లేడీస్‌'కు మరో అంతర్జాతీయ గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ చిత్రం 'లాపతా లేడీస్‌' ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారానికి పోటీ పడుతోంది. 'జపాన్‌ అకాడమీ ఫిల్మ్‌ ప్రైజ్‌ 2024' అవార్డులలో 'బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌' కేటగిరీలో ఈ చిత్రం షార్ట్‌లిస్ట్‌ అయింది. ఈ విభాగంలో 'ఓపెన్‌హైమర్‌', 'పూర్‌ థింగ్స్‌', 'ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌', 'సివిల్‌ వార్‌' వంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌లకు గట్టి పోటీగా నిలిచింది . విజేతల వివరాలను వచ్చే ఏడాది మార్చి 14న జరిగే వేడుకలో ప్రకటించనున్నారు. కిరణ్‌ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితాన్షీ గోయల్‌, ప్రతిభా రంతా, స్పర్శ్‌ శ్రీవాత్సవ, ఛాయా కదమ్‌, రవి కిషన్‌ కీలక పాత్రలు పోషించారు.

Details

టీఐఎఫ్‌ఎఫ్‌ వేడుకల్లో లపతా లేడీస్ ప్రదర్శన

గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన రెండు నవ వధువుల జీవన ప్రయాణాన్ని ఆసక్తికరంగా ఈ చిత్రం ఆవిష్కరించింది. ఈ చిత్రం మొదట టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలో ప్రదర్శించడం విశేషం. అంతేకాదు 'ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌ (ఐఎఫ్ఎఫ్ఎం)' అవార్డుల్లో క్రిటిక్స్‌ ఛాయిస్‌ విభాగంలో ఉత్తమ సినిమాగా గెలుపొందింది. 2025 ఆస్కార్‌ అవార్డుల కోసం భారతదేశం తరఫున నామినేట్‌ అయినా చివరి షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. గతేడాది మార్చి నెలలో భారతదేశంలో విడుదలైన ఈ చిత్రం అక్టోబరులో జపాన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికీ విమర్శకుల ప్రసంశలు అందుకుంటూ, గ్లోబల్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో భారత సినిమాకు గౌరవం తీసుకురావడంలో ఈ చిత్రం కీలక పాత్ర పోషిస్తోంది.