Ap Highcourt : గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల పెంపుపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి కానుకగా జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "గేమ్ చెంజర్" సినిమా, జనవరి 12న నందమూరి బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్" సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ రెండు సినిమాలకు సంబంధించిన టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
"గేమ్ చెంజర్" విడుదల రోజున బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600గా, "డాకు మహారాజ్" బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 500గా నిర్ణయించింది.
అంతేకాకుండా, రెగ్యులర్ షోలకు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై రూ. 135, సింగిల్ స్క్రీన్ టికెట్ ధరపై రూ. 110 పెంచుతూ జీవో విడుదల చేసింది.
వివరాలు
నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలను పెంచారని పిటిషన్
అయితే, ఈ పెరిగిన టికెట్ ధరలను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పిటిషనర్ తమ వాదనలో, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తవచ్చని పేర్కొన్నారు.
అలాగే, నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలను పెంచారని పిటిషన్‌లో స్పష్టం చేశారు.
ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, "గేమ్ చెంజర్", "డాకు మహారాజ్" చిత్రాల నిర్మాతలకు షాక్ ఇచ్చింది.
హైకోర్టు, టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ విచారణ నిర్వహించి, ఈ ధరల పెంపు గడువును 14 రోజుల నుంచి 10 రోజులకు పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.