Rishab shetty: రిషబ్ శెట్టి కోసం హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నాహాలు!
ఈ వార్తాకథనం ఏంటి
'కాంతార' చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్'లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.
వివరాలు
యాక్షన్ డిజైనర్ మార్క్ హెన్సన్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు అత్యంత కీలకంగా ఉండనున్నాయి.
వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించాలనే ఉద్దేశంతో చిత్ర బృందం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్ నిపుణులను ఎంపిక చేసింది.
'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'వైకింగ్స్', 'గ్రావిటీ' వంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లకు పనిచేసిన ప్రముఖ యాక్షన్ డిజైనర్ మార్క్ హెన్సన్ ఈ యాక్షన్ బృందానికి నాయకత్వం వహిస్తున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం.