కేలరీల కొరత: బరువు తగ్గడానికి పనికొచ్చే అద్భుతమైన టెక్నిక్
కేలరీల కొరత అంటే ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఆగండి అక్కడికే వస్తున్నాం. సాధారణంగా మన తిన్న ఆహారం నుండి వచ్చే ఎనర్జీని కొలిచే ప్రమాణమే కేలరీ. కేలరీల కొరత అంటే, మీరు మీ శరీర అవసరాలకు వీలైనన్ని కేలరీలు అందించకుండా ఆల్రెడీ కొవ్వులో ఉన్న శక్తిని ఉపయోగించుకునేలా చేయడం. దీనివల్ల మీ శరీరంలో కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు. మరి కేలరీల కొరత సృష్టించడానికి ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం. మీరు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారనే దానిమీద కేలరీల కొరత ఎంత ఉండాలనేది ఆధారపడి ఉంటుంది. అంతేకాదు మీ వయసు, శక్తి, ఆడా మగా అనేదాన్ని బట్టి కేలరీల కొరత ఎంత సృష్టించాలనేది ఆధారపడి ఉంటుంది.
కేలరీల కొరత సృష్టించి బరువు తగ్గడానికి మారాలు
ఉదాహరణకు మీరు రోజుకు 500కేలరీల కొరత సృష్టించాలని అనుకున్నారనుకుందాం. వారం రోజులకు 3500కేలరీల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల మీరు అరకిలో బరువు తగ్గుతారు. తక్కువ కేలరీలున్న పోషకాహారాలను తినాలి: తక్కువ కేలరీలున్న పండ్లు, పాల పదార్థములు, తృణ ధాన్యాలు, ఫైబర్ ఆహారాలు తీసుకోవడం మంచిది. కూల్ డ్రింక్స్, ఫ్రై చేసిన ఆహారాలు, స్వీట్స్ ముట్టుకోవద్దు. వ్యాయామం: రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వల్ల కేలరీల కొరత ఏర్పడుతుంది. లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కండి. కేలరీలు టపటపా కరిగిపోతాయి. తక్కువ ఆహారం: తినే ఆహారం మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ తినండి. అలా అని పూర్తిగా తినకపోతే డేంజర్ లో పడతారు. మీ శరీరానికి ఎలా సరిపడుతుందో తెలుసుకుని ఎంత తినాలనేది డిసైడ్ అవ్వండి.