బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి
బరువు తగ్గాలని ఆలోచించే వారు పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కొన్ని సార్లు వాళ్లలో పెద్ద మార్పేమీ ఉండదు. అలాంటి వాళ్ళు నిరాశ పడకుండా ఈ పండ్లను ఆహారంగా తీసుకోవడం మొదలెట్టాలి. చలికాలంలో ఎక్కువగా లభించే ఈ పండ్లు, పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేసి ఆకర్షణీయమైన లుక్ అందిస్తాయి. జామ: చలికాలంలో జామపండ్లు విరివిగా లభిస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. సో మీరు ఎక్కువ తినకుండా ఉంటారు. అదీగాక జామపండ్ల గ్లిసమిక్ ఇండెక్స్ విలువ తక్కువ ఉంటుంది, కావున రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. చలికాలం ఐపోవస్తున్న ప్రస్తుత సమయంలో జామపండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి.
ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్ల వల్ల పొట్టకొవ్వు మాయం
నారింజ: విటమిన్ సి అధికంగా ఉండే నారింజ పండ్లలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. స్టార్ ఫ్రూట్: బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును ఖచ్చితంగా తమ డైట్ లో చేర్చుకుంటారు. ఇందులోని ఫైబర్ వల్ల మలబద్దకం దూరమవుతుంది. స్ట్రాబెర్రీ: తినడానికి మంచి రుచికరంగా ఉండే స్ట్రాబెర్రీల్లో కేలరీలు తక్కువ శాతంలో ఉంటాయి. 100గ్రాముల స్ట్రాబెర్రీల్లో 33కేలరీలు ఉంటాయి. వీటిని డైరెక్ట్ గా తినవచ్చు లేదా సలాడ్ తో లాగించేయిచ్చు. ఆపిల్: ఆపిల్ లో ఆరోగ్యకరమైన ఫ్లెవనాయిడ్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉంటుంది. అలాగే చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి.