బరువు తగ్గడం: 80-20 రూల్ డైట్ పాటిస్తే వచ్చే లాభాలు
మీరు తినాలనుకున్నది తింటూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చన్న సంగతి మీకు తెలుసా? ఇది ఎవరికైనా చెబితే అసాధ్యం అని అంటారు. కానీ ఇది సాధ్యమే. డైట్ లో 80-20 రూల్ తో ఇది ఈజీగా సాధ్యపడుతుంది. ముందుగా ఈ 80-20 రూల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మీ డైట్ లో 80శాతం పోషకాలున్న ఆహారాన్ని తినడం, మిగతా 20శాతం మీకు నచ్చిన ఆహారాన్ని తినడమే ఈ డైట్ రూల్. అంటే ఒక భోజనంలో 80శాతం పోషకాలున్న ఆహారాన్ని తింటే 20శాతం మీకు నచ్చింది తినవచ్చు. మొక్కల నుండి వచ్చే ఆహారాలు, కూరగాయలు, మంచికొవ్వు ఉండే పదార్థాలు, గింజలు, మొలకలు, ఒమెగా 3కొవ్వులు, తక్కువ కొవ్వు ఉండే పాల పదార్థాలు 80శాతంలో ఉండాలి.
మరి 20శాతంలో
ఆల్కహాల్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు ఉండవచ్చు. ఐతే ఈ ఆహారాలను ఎక్కువగా తింటే మీ డైట్ రూల్ లో తేడాలు వచ్చేసి దాని ప్రభావం మీ శరీరం మీద పడుతుంది. ఈ రూల్ పాటించడం వల్ల మంచి లాభాలున్నాయి. మీకు నచ్చింది తింటూనే ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ రూల్ పాటిస్తున్నప్పుడు మీరు బరువు తగ్గకపోవచ్చు. ఎందుకంటే డైట్ అనేది ఒక్కొక్కరి మీద ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈ డైట్ రూల్ ని సరిగ్గా పాటించలేరు. ఏదో ఒక సమయంలో ఈ రూల్ ని బ్రేక్ చేస్తారు. అది వాళ్ళకు అలవాటుగా మారిపోతుంది.