పొట్ట తగ్గించడంలో ప్రతీసారీ ఫెయిల్ అవుతున్నారా? ఈ ఆహారాలు ట్రై చేయండి
కేలరీలు ఎక్కువగా ఉండే అహారాలనే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. కానీ వాటివల్ల కొవ్వు మొత్తం పొట్ట దగ్గర చేరుతుంది. అప్పుడు మళ్లీ దాన్ని కరిగించుకోవడానికి కష్టపడతారు. ఈ మధ్య కాలంలో బరువు తగ్గడం అంటే పొట్టకొవ్వు తగ్గించుకోవడమే అయ్యింది. ఎక్సర్ సైజ్, జిమ్ ఇలా ఏది పడితే అది చేసి పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ ఎక్సర్ సైజ్, జిమ్ లాంటివి ఎక్కువ రోజులు చేయలేక చేతులెత్తుస్తున్నారు. ఫలితం పొట్ట పెరుగుతూనే ఉంటుంది. మరి దీన్ని తగ్గించాలంటే ఎలా? కేవలం కొన్ని ఆహారాలతో పొట్టకొవ్వును తగ్గించవచ్చు. ఆ అహారాలేంటో, వాటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుని పొట్టకొవ్వును తగ్గించే ప్రయత్నం చేద్దాం.
అల్లం, గ్రీన్ క్యాప్సికమ్, పసుపు
గ్రీన్ క్యాప్సికమ్: కొవ్వును కరిగించే పోషకాలు గ్రీన్ క్యాప్సికమ్ లో పుష్కలంగా ఉన్నాయి. వీటితో కూరలు తయారు చేసుకోవచ్చు. మీ డైలీ డైట్ లో గ్రీన్ క్యాప్సికమ్ ని కలుపుకోండి. అల్లం: చలికాలంలో ఒక్క అల్లం టీ తాగితే చలి దూరమైపోయి శరీరం వేడిగా మారుతుంది. అల్లంలోని పోషకాల వల్ల కొవ్వు కరిగిపోతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం అల్లం వల్ల పొట్టకొవ్వు కరుగుతుందని తెలిసింది. అల్లం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు కొవ్వు కరగడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. కాబట్టి అల్లంను మర్చిపోవద్దు. పసుపు: పసుపులో ఉండే పొషకాలు అన్నీ ఇన్నీ కావు. పొట్టకొవ్వు తగ్గడానికి రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో పసుపు వేసుకుని తాగాలి.