
Chandra mohan: మా మామ అందువల్లే చనిపోయారు: చంద్రమోహన్ మేనల్లుడు
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
అయితే ఆయన మృతిపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రమోహన్ చనిపోవడానికి గల కారణాలను ఆయన మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తాజాగా మీడియాకు వివరించారు.
చంద్రమోహన్ నాలుగేళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు శివలెంక కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకు కిడ్నీ సమస్య కూడా వచ్చినట్లు వివరించారు.
దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే శనివారం ఉదయం ఇంట్లో సొమ్మసిల్లి పడిపోయారని, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు చనిపోయినట్లు నిర్దారించారని కృష్ణప్రసాద్ వాపోయారు.
చంద్రమోహన్ కూతురు అమెరికా నుంచి వచ్చాక.. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చంద్రమోహన్ పార్థీవదేహానికి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నివాళి
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ గారి మృతి పట్ల తమ ప్రగడ సానుభూతి తెలిపిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/Pz8bUocicv
— Nokesh Manchala (@nokesh_manchala) November 11, 2023