Page Loader
చంద్రయాన్-3: చరిత్ర సృష్టించిన భారత్: సెలబ్రిటీల శుభాకాంక్షలు   
చంద్రయాన్-3 శాస్త్రవేత్తలకు సెలెబ్రిటీల శుభాకాంక్షలు

చంద్రయాన్-3: చరిత్ర సృష్టించిన భారత్: సెలబ్రిటీల శుభాకాంక్షలు   

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 23, 2023
07:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. చప్పట్లతో తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ఈ ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, చంద్రయాన్-3 విజయవంతం కావడంతో తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈరోజు చరిత్ర సృష్టించబడిందని చెబుతూ, చంద్రయాన్-3 శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేసారు.

Details

రామ్ చరణ్, రాజమౌళి ట్వీట్ 

మెగా హీరో వరుణ్ తేజ్ కూడా చంద్రయాన్-3 సక్సెస్ ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు భారతదేశాన్ని గర్వించేలా చేసారని ఆయన అన్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి, చంద్రయాన్-3 విజయం వల్ల గర్వంతో గుండె ఉప్పొంగిందనీ, ఆనంద భాష్పాలతో చెంపలు తడిసిపోయాయని ఎమోషనల్ ట్వీట్ చేసారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిరంజీవి ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజమౌళి ట్వీట్