Kaaka Update: పండగ మనదే అంటున్న చిరు.. 'కాకా'పై ఫుల్ క్లారిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి 'కాకా' (Kaaka) సినిమాతో కదిరి కాళిదాస్‌గా సందడి చేయనున్నారు. చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను చిరంజీవి స్వయంగా వెల్లడించారు. 'సిగ్మా' ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరు.. 'కాకా' సినిమా గురించి మాట్లాడారు.
వివరాలు
ఫస్ట్ హాఫ్ పూర్తి.. సంక్రాంతికి రిలీజ్
'సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయింది. సెకండ్ హాఫ్ కూడా 30 శాతం అయిపోయింది. ఫస్ట్ హాఫ్‌కు తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నారు.
కచ్చితంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం. పండగ మనదే'' అని చిరంజీవి తెలిపారు. చిరంజీవి చేసిన ఈ ప్రకటనతో 'కాకా' సినిమా జనవరి 13న విడుదల కావడం ఖాయమని మరోసారి స్పష్టమైంది.
దీంతో 'కాకా' చిత్రబృందం ఫుల్ జోష్‌లో ఉంది. ఒకవైపు షూటింగ్ కొనసాగిస్తూనే మరోవైపు డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ వీడియోను కూడా షేర్ చేసింది.
వివరాలు
2027 సంక్రాంతి సినిమాలివే..
వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా పలువురు అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.
ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న 'కాకా' విడుదల ఖరారైంది. సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టే దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా పండగ బరిలో నిలుస్తున్నారు.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'జనవరి 12న విడుదల'తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తుండగా.. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
మరో అగ్రకథానాయకుడు రజనీకాంత్ నటిస్తున్న 'ధర్మన్' (Dharman) కూడా సంక్రాంతికే విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వివరాలు
బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ
వీటితో పాటు శర్వానంద్ నటిస్తున్న 'జార్జ్ క్రిష్', సాయిదుర్గా తేజ్ 'సంబరాల ఏటి గట్టు' (Sambarla Yeti Gattu), శ్రియారెడ్డి, అక్షయ్ ఖన్నా నటిస్తున్న 'మహాకాళి' (Mahakali Movie) కూడా సంక్రాంతి బరిలో నిలవనున్నాయి.
దీంతో 2027 సంక్రాంతికి టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుల సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది.