కలర్స్ స్వాతి విడాకులు తీసుకోనుందా? ఫోటోలు డిలీట్ చేయడానికి కారణమేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
టెలివిజన్ ప్రోగ్రాం కలర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్వాతి, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్న స్వాతి తెలుగులో చాలా సినిమాలు చేసింది.
అయితే కొన్ని ఏళ్ళ క్రితం తన చిన్ననాటి ఫ్రెండ్ వికాస్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. కానీ ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా స్వాతి పై ఒక న్యూస్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
స్వాతి విడాకులు తీసుకోనుంనిందని, తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టనుందని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ పుకార్లకు కారణం ఇన్ స్టాగ్రామ్ లో భర్త ఫోటోలు డిలీట్ చేయడమేనని తెలుస్తోంది.
Details
సమంత, నీహారికలను గుర్తు చేస్తున్న నెటిజన్లు
తన భర్తకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ నుండి కలర్స్ స్వాతి డిలీట్ చేసిందని, భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ఈ విధంగా హింట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
గతంలో హీరోయిన్ సమంత, నీహారిక కొనిదెల కూడా ఇలానే ముందుగా తమ సోషల్ అకౌంట్లలో నుండి ఫోటోలను డిలీట్ చేశారని, ఆ తర్వాత అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి పుకార్లు ఒకసారి రావడంతో అలాంటిదేమీ లేదని స్వాతి వివరణ ఇచ్చింది. అదలా ఉంచితే, ప్రస్తుతం స్వాతి హైదరాబాద్లో షూటింగ్ లో ఉంది. తన భర్త వికాస్ థాయిలాండ్ లో ఉంటున్నాడు.