Cannes 2026: కేన్స్‌లో ఐశ్వర్య లుక్‌పై విమర్శలు.. ట్రోలర్స్‌పై మండిపడ్డ కంగనా రనౌత్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన స్టైలిష్ ఫ్యాషన్ లుక్‌తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన కుమార్తె ఆరాధ్యతో కలిసి రెడ్ కార్పెట్‌పై హొయలొలికించిన ఐశ్వర్య, మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే ఈసారి ఆమె లుక్‌పై సోషల్ మీడియాలో కొంత విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ ట్రోలింగ్‌పై ఐశ్వర్య నేరుగా స్పందించకపోయినా, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాత్రం ట్రోలర్స్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐశ్వర్య ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కంగనా, ఆమెను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు
"ఫ్యాషన్, స్టైల్ అనేవి పూర్తిగా వ్యక్తిగత అభిరుచికి సంబంధించినవి. ఎవరికీ నచ్చినట్లు వారు తమ దుస్తులను ఎంపిక చేసుకుంటారు. తమకు సౌకర్యంగా అనిపించిన విధంగా ఉండటం వారి హక్కు. ఈ విషయంలో ఏ మహిళ కూడా ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేన్స్‌లో ఐశ్వర్య అద్భుతంగా కనిపించారు. ఆమెను వేరే స్టైల్‌లో చూడాలనుకునే వారు ముందుగా తమ దగ్గర ఉన్న స్టైల్‌ను ప్రపంచానికి చూపించాలంటూ కంగనా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, "రెడ్ కార్పెట్‌పై ఎప్పుడూ యువ నటీమణులే కనిపించరు. 50 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు కూడా అదే స్థాయిలో మెరవగలరు.
వివరాలు
ఇకనైనా అలవాటు చేసుకోవాలి
అలాంటి వారిని చూడటానికి అలవాటు లేకపోతే ఇకనైనా అలవాటు చేసుకోండి" అని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో మే 12 నుంచి 23 వరకు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన 'లుమినారా' అనే డీప్ సఫైర్ బ్లూ గౌన్‌లో ఐశ్వర్య రెడ్ కార్పెట్‌పై మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే రెండో రోజు వైట్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిస్తూ మరోసారి తన గ్లామర్‌తో ప్రత్యేకంగా నిలిచారు.