Page Loader
Indian 2: ఇండియన్ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్.!
Indian 2: ఇండియన్ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్.!

Indian 2: ఇండియన్ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్.!

వ్రాసిన వారు Stalin
Jun 23, 2024
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ 2 సినిమాను దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించారు.జూలై 12న గ్రాండ్ రిలీజ్‌కి షెడ్యూల్ చేశారు. ఈ చిత్రం తమిళం,తెలుగు, హిందీ భాషల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా భాషాపరమైన విడుదల కానుంది. జూన్ 25న ముంబైలో థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించడానికి కౌంట్‌డౌన్ ప్రారంభమవుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. తేదీని నిర్ణయించినప్పటికీ, అభిమానులు ఆత్రంగా వేదిక , సమయ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. మూవీ పై దర్శకుడు శంకర్, కమల్ హాసన్‌ తో పాటు కాజల్ అగర్వాల్, తదితర నటులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

వివరాలు 

జోరు పై వున్న లోకనాయకుడు

కొన్ని రోజులుగా సరైన విజయాలు లేక ఇబ్బందిపడ్డారు కమల్‌హాసన్‌. అయితే.. ప్రస్తుతం ఆయన టైమ్‌ నడుస్తున్నది. కమల్‌ 'విక్రమ్‌' సినిమా ఆరువందలకోట్ల వసూళ్లను రాబట్టి, ఆయన కెరీర్‌లోనే భారీ విజయంగా నిలిచింది. ఈ నెల 27న 'కల్కి 2898'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు కమల్‌. ఇందులో ఆయన సుప్రీం యాస్కిన్‌గా ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వేడి చల్లారకముందే.. 'ఇండియన్‌ 2'ని కూడా సిద్ధం చేసేశారు కమల్‌హాసన్‌.