
Ileana: ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా..? ఫాదర్స్ డే ఫోటోతో నెట్టింట్లో హల్చల్!
ఈ వార్తాకథనం ఏంటి
గోవా సుందరి ఇలియానా దక్షిణ సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్లో పలు స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్గా ఎదిగిన ఆమె, తర్వాత బాలీవుడ్ ప్రయాణం ప్రారంభించి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కక చతికిలపడింది.
అదే సమయంలో మైఖేల్ డోలన్ అనే పోర్చుగీస్ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన ఆమె, కొంతకాలం డేటింగ్ అనంతరం అతనిని వివాహమాడింది.
వివాహం అనంతరం పోర్చుగీస్ వారసత్వాన్ని స్వీకరించిన ఇలియానా, 2023 ఆగస్టులో తొలి సంతానంగా ఒక కుమారుడికి జన్మనిచ్చింది.
ఇప్పటికే రెండోసారి తల్లి కాబోతుందన్న వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి.
Details
ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేసిన ఇలియానా
ఇదిలా ఉండగా, తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా భర్త మైఖేల్ డోలన్ తన బిడ్డను ముద్దాడుతున్న ఓ ఫొటోను ఇలియానా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ఆ బిడ్డ పూర్తిగా కొత్తగా పుట్టినట్టు కనిపించడంతో నెటిజన్లలో సందేహాలు కలుగుతున్నాయి. "ఇలియానా ఇప్పటికే రెండో బిడ్డకు జన్మనిచ్చిందా?" అనే చర్చ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఆ పసివాడి లింగం గురించి ఇలియానా ఎటువంటి సమాచారం బయటపెట్టలేదు. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
ఇలియానా నటించిన తాజా చిత్రం హిందీలో వచ్చిన 'దో ఔర్ దో ప్యార్'. ఈ సినిమా తర్వాత ఆమె 'రైడ్ 2' లాంటి కొన్ని ప్రాజెక్టులను ప్రెగ్నెన్సీ కారణంగా వదులుకోవాల్సి వచ్చింది.