Page Loader
Shyam Benegal : ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ కన్నుమూత

Shyam Benegal : ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2024
08:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్ బెనగల్‌ (90) మరణించారు. ఈ సమాచారాన్నిఅయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఆయన బాధపడుతున్నారు. 1934లో అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో జన్మించిన శ్యామ్‌ బెనగల్‌ తన సినీ జీవితంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలను అందుకున్నారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, అలాగే ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డు వంటి గౌరవాలు లభించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్యామ్‌ బెనగల్‌ కన్నుమూత

వివరాలు 

తిరుమలగిరిలో జన్మించిన శ్యామ్ బెనగల్‌

1934 డిసెంబర్ 14న హైదరాబాద్ సమీపంలోని తిరుమలగిరిలో జన్మించిన శ్యామ్ బెనగల్‌ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేశారు. ఆయన 2003లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారాన్నిఅందుకున్నారు. ప్రతిష్టాత్మక చిత్రాలైన అంకుర్, నిశాంత్, మంథన్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.