Loading...
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులు.. లిస్టులో ఎవరెవరంటే?
చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులు.. లిస్టులో ఎవరెవరంటే?

Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులు.. లిస్టులో ఎవరెవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి బరిలో ఎట్టిపరిస్థితుల్లోనూ తన సినిమాను నిలిపేందుకు మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడుతో పని చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనవరి 13న విడుదల తేదీని ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ముచ్చింతల్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఫైట్స్, పాటలు మినహా మిగిలిన షూటింగ్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్క్రీన్‌ప్లే రైటర్ కోన వెంకట్ వెల్లడించారు.

వివరాలు

చిరంజీవి నెక్ట్స్ మూవీ ఎవరితో..?

బాబీ సినిమా తర్వాత చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. నాని నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఆగిపోయినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

'ది ప్యారడైజ్' సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లడంతో మెగాస్టార్‌తో సినిమా చేసేందుకు పలువురు టాలీవుడ్ దర్శకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్న బుచ్చిబాబు సానా కూడా చిరంజీవికి కథ వినిపించినట్లు టాక్. '

వివరాలు

చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్

పెద్ది' సినిమా అనుకున్న విధంగా ముందుకు సాగకపోయినా, చిరంజీవి తనకు అవకాశం ఇస్తారనే ఆశతో ఆయన కథను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది

. మరోవైపు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వంటి దర్శకులు సైతం మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

వీరిలో చిరంజీవి ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

వివరాాలు

సడన్ ఎంట్రీ ఇచ్చిన తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్!

టాలీవుడ్ దర్శకులు చిరంజీవి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరపైకి వచ్చారు.

ఆయన స్వయంగా మెగాస్టార్‌ను కలిసి ఓ కథ వినిపించినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరంజీవి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని టాక్.

ప్రస్తుతం వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న కార్తీక్ సుబ్బరాజ్‌కు చిరంజీవి అవకాశం ఇస్తారా? అనే చర్చ మొదలైంది.

గతంలో రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' కథ విషయంలోనూ దర్శకుడి ఎంపికపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో, అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి కార్తీక్ సుబ్బరాజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

అధికారిక ప్రకటన అవసరం

అయితే 'గేమ్ ఛేంజర్'కు సంబంధించిన కథను కార్తీక్ సుబ్బరాజ్ అందించారనే అంశంపై అధికారిక నిర్ధారణ అవసరం.

అలాగే చిరంజీవి, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే వార్తకు కూడా ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

మొత్తానికి, ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు చిరంజీవి బిజీగా ఉన్నారు.

ఆ తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో మాత్రం పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

బుచ్చిబాబు, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్‌లలో ఎవరికి అవకాశం దక్కుతుంది? లేదా తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో మెగాస్టార్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారా? అన్నది తెలియాలంటే చిరంజీవి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT