
Vijay Sethupathi: విజయ్ సేతుపతి సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు పూరి జగన్నాథ్ మూవీ అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. 'డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్'గా పేరు తెచ్చుకున్న పూరి, గతంలో వచ్చిన 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' ప్లాప్‌ల వల్ల కొంత నిరాశ చెందాడు.
ఈ పరాజయాలను మరిచి, మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని పూరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కొత్త ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా పలు స్టార్ హీరోల చుట్టూ తిరిగిన పూరి, చివరికి విజయ్ సేతుపతిని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు.
తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీయాలనే లక్ష్యంతో ఓ భారీ ప్రణాళిక వేసుకున్నారు.
ఈసారి పాత పూరిని గుర్తు చేసుకునేలా అదిరిపోయే స్టోరీతో వస్తున్నారని సమాచారం.
Details
'బెగ్గర్' టైటిల్ ఫిక్స్!
ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారని, అందుకే చిత్రానికి 'బెగ్గర్' అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సమాచారం.
సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అప్‌డేట్ వస్తుండగా, ఇందులో నటీనటుల ఎంపిక కూడా బాగా ఆసక్తికరంగా మారుతోంది.
ఈ మూవీలో బాలీవుడ్ నటి టబు ప్రధాన పాత్రలో నటించనున్నారని, అలాగే టాలెంటెడ్ హీరోయిన్ రాధిక ఆప్టే కూడా టీంలో చేరినట్లు తెలుస్తోంది.
Details
నివేదా థామస్ స్పెషల్ రోల్
తాజాగా మరో హాట్ అప్‌డేట్ బయటికి వచ్చింది. నివేదా థామస్ కూడా ఈ సినిమాలో భాగమవుతుందట. ఆమె విజయ్ సేతుపతికి భార్య పాత్రలో నటించనుందని సమాచారం.
ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్లు టాక్.
జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్
ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
పూరి జగన్నాథ్ ఈసారి కొత్తగా ట్రై చేస్తూ తన మార్క్ మళ్లీ రీడిఫైన్ చేయాలని కసిగా ఉన్నారు. మరిన్ని అఫీషియల్ డిటైల్స్ త్వరలో వెల్లడి కానున్నాయి.