Ranveer Singh: ముదిరిన 'డాన్ 3' వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై మూడేళ్ల బ్యాన్!
ఈ వార్తాకథనం ఏంటి
'ధురంధర్' రెండు భాగాలతో వరుస విజయాలు అందుకుని బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన 'డాన్ 3' వివాదం తాజాగా మరింత ముదిరింది. ఏకంగా ఈ అగ్ర హీరోపై మూడేళ్ల నిషేధం విధించే పరిస్థితి ఏర్పడింది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత 'డాన్' పాత్రను పోషించాల్సిన రణ్‌వీర్ సింగ్‌పై 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్' (FWICE) మూడేళ్ల బ్యాన్ విధించింది. దీంతో ఈ అంశం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వివరాలు
రణ్‌వీర్-ఫర్హాన్ మధ్య విభేదాలు?
2023లో ఫర్హాన్ అక్తర్‌కు చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, రణ్‌వీర్ సింగ్ హీరోగా 'డాన్ 3' చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పట్లో విడుదలైన ప్రమోషనల్ వీడియో భారీ హైప్‌ను సృష్టించింది. అయితే సినిమా ప్రారంభం ఆలస్యం కావడం, స్క్రిప్ట్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. రణ్‌వీర్ సింగ్ 'డాన్' పాత్రను మరింత డార్క్, హింసాత్మకంగా చూపించాలని కోరినట్లు సమాచారం. అయితే దర్శకుడు ఫర్హాన్ అక్తర్ పాత్రలో పెద్ద మార్పులకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కావడంతో అసహనానికి గురైన రణ్‌వీర్ చివరకు ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
వివరాలు
రూ.10 కోట్ల ఆఫర్ వార్తలు
'డాన్ 3' నుంచి తప్పుకున్న తర్వాత ఫర్హాన్ అక్తర్‌కు రణ్‌వీర్ రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపించాయి. అలాగే తన తదుపరి చిత్రం 'ప్రళయ్'లో ఫర్హాన్ నిర్మాణ సంస్థకు వాటా ఇవ్వడానికి కూడా ఆయన అంగీకరించారని టాక్ నడిచింది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఇదే సమయంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రణ్‌వీర్ సింగ్‌పై రూ.45 కోట్ల ప్రీ-ప్రొడక్షన్ నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్యే FWICE ఆయనపై మూడేళ్ల నిషేధం విధించింది.
వివరాలు
రణ్‌వీర్‌పై నిషేధం.. అసలు ప్రభావం ఏంటి?
రణ్‌వీర్ చర్చలకు సహకరించడం లేదని, నిర్మాతలకు జరిగిన రూ.45 కోట్ల నష్టపరిహారం విషయంలో నిర్మాణ సంస్థతో వివాదం పరిష్కారం అయ్యే వరకు ఆయనతో కలిసి పని చేయవద్దని సినీ పరిశ్రమకు FWICE సూచించింది. సినిమాలు కీలక దశలో ఉన్నప్పుడు స్టార్ హీరోలు ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకోవడం వల్ల వినోద పరిశ్రమ స్థిరత్వానికి, పని వాతావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని FWICE తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఇది ప్రభుత్వ స్థాయి నిషేధం కాకపోవడంతో రణ్‌వీర్ కెరీర్‌పై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సి రావొచ్చని, కానీ కొత్త సినిమాలు అంగీకరించడంపై మాత్రం నేరుగా ఆంక్షలు ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
వివరాలు
స్పందించిన రణ్‌వీర్ టీమ్
ఈ మొత్తం వివాదంపై రణ్‌వీర్ సింగ్ టీమ్ కూడా స్పందించింది. "రణ్‌వీర్ తన వృత్తిని ఎంతో గౌరవిస్తారు. 'డాన్ 3' అంశంపై ఆయన నేరుగా స్పందించకపోవడానికి అదే కారణం. ఊహాగానాలకు మరింత ఆజ్యం పోయడం ఆయనకు ఇష్టం లేదని టీమ్ తెలిపింది. 'డాన్ 3'లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన గౌరవిస్తారని, ఆ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు కూడా ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తానికి రణ్‌వీర్ సింగ్‌పై విధించిన ఈ నిషేధం ప్రస్తుతం బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం ఆయన భవిష్యత్ ప్రాజెక్టులపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.