LOADING...
Shankar: ప్రముఖ దర్శకుడు శంకర్‌ రూ.10 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ 
ప్రముఖ దర్శకుడు శంకర్‌ రూ.10 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ

Shankar: ప్రముఖ దర్శకుడు శంకర్‌ రూ.10 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 21, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన సుమారు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, ఈ నెల 17న ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ వెల్లడించింది. 2011లో అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి శంకర్ పై పిటిషన్ దాఖలు చేశారు.

వివరాలు 

ఏం జరిగిందంటే? 

తన 'జిగుబా' అనే కథను కాపీ కొట్టి, 'రోబో' సినిమాగా తీశారని ఆరోపించారు. శంకర్ కాపీరైట్, ఐటీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక ఈ కేసుపై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) నిర్వహించిన విచారణలోనూ శంకర్‌కు వ్యతిరేకంగా నివేదిక వచ్చిందని తెలుస్తోంది. 'జిగుబా' కథకు, 'రోబో' సినిమాకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని అందులో స్పష్టం చేశారు. శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్టు ఈడీ తేల్చింది.దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'రోబో' 2010లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే,శంకర్ ఈ సినిమాకు రూ.15 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.