
Erracheera: ఎర్రచీర.. కథ కరెక్టుగా గెస్ చేస్తే ఐదు లక్షలు బహుమతి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పేరు 'ఎర్రచీర'.
దీనికి ట్యాగ్‌లైన్‌గా 'ది బిగినింగ్'ను పెట్టారు. ఈ సినిమాను సుమన్ బాబు స్వయంగా దర్శకత్వం వహించడమే కాకుండా, కీలక పాత్రలో కూడా కనిపించబోతున్నారు.
మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలను సమ్మిళితం చేస్తూ రూపొందించిన ఈ చిత్రం మొదటగా ఏప్రిల్ 25న విడుదలవ్వాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.
ఇప్పుడు వేసవి కానుకగా, మే రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు, నిర్మాత అయిన సుమన్ బాబు వెల్లడించారు.
వివరాలు
కామెడీ, హారర్, మదర్ ఎమోషన్, యాక్షన్ అన్నీ మిక్స్
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ - ''ఈ నెల 25న 'ఎర్రచీర'ను విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తుంటాం. సినిమా కంటెంట్ చాలా బలంగా ఉంటుంది. కామెడీ, హారర్, మదర్ ఎమోషన్, యాక్షన్ అన్నీ మిక్స్ చేసి ప్రేక్షకులకు ఎక్కడా విసుగు కలగకుండా తయారుచేశాం. సినిమా చూసినవారు థియేటర్ నుంచి బయటకు వస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు అనడంలో సందేహమే లేదు. సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా సినిమా చూసి మెచ్చుకున్నారు. 'చాలా మంచి సినిమా చేశారు' అని ప్రశంసించారు.''
వివరాలు
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బహుమతి
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ''ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన కాంటెస్ట్‌ను ప్రకటిస్తున్నాం. సినిమా కథను విడుదలకి ముందు ఎవరైనా సరిగ్గా అంచనా వేస్తే, వారికి ఐదు లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం. 8019246552 నంబర్‌కు సరైన కథను పంపినవారిలో విజేతగా ఎంపికైనవారికి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఐదు లక్షల బహుమతి అందజేస్తాం,'' అని సుమన్ బాబు చెప్పారు.