
The Paradise :'ది ప్యారడైజ్'పై ఫేక్ రూమర్స్.. ఘాటుగా స్పందించిన మూవీ టీం!
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరో నాని ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే, నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'.
'దసరా' తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ రెండో చిత్రం 2026 మార్చి 26న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ విడుదల కానుంది.
అంతేకాదు ఈ పాన్ ఇండియా మూవీని ఇంగ్లిష్, స్పానిష్ వంటి విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, మ్యూజిక్‌ను అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.
Details
జోకర్లకి త్వరలోనే సమాధానం చెబుతాం
కాగా, 'ది ప్యారడైజ్'పై తాజాగా కొన్ని షాకింగ్ రూమర్లు వైరల్ అవుతున్నాయి. సినిమా బడ్జెట్ సమస్యల కారణంగా నిలిచిపోయిందంటూ పుకార్లు ప్రచారంలోకి రావడంతో, మూవీ టీం దీనిపై ఘాటుగా స్పందించింది.
ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేకున్నా, కొందరు తమ ఊహాగానాలతో వార్తలు సృష్టిస్తున్నారు. 'ది ప్యారడైజ్' మూవీ విషయంలోనూ ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో చిత్రబృందం స్పందిస్తూ 'కొంతమంది మా సినిమా బడ్జెట్ సమస్యలతో ఆగిపోయిందంటూ రూమర్లు వ్యాప్తి చేస్తున్నారు. అసలు ఇలాంటి జోకర్స్‌కి సమాధానం మా సినిమా విడుదలతోనే తెలుస్తుంది.
సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారికి సమయం దగ్గర్లోనే ఉందంటూ వార్నింగ్ ఇచ్చింది.