Anirudh Ravichander: పబ్లిక్‌లో కావ్య పేరుతో ఫ్యాన్స్ రచ్చ.. సిగ్గుతో నవ్వేసిన అనిరుధ్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్‌కు అభిమానుల నుంచి ఓ సరదా అనుభవం ఎదురైంది. నిన్న జరిగిన 'చెన్నై రన్స్ 2026' ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులతో అనిరుధ్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా వారు ఆయన కాబోయే భార్య కావ్య మారన్ పేరును ప్రస్తావిస్తూ 'కావ్య.. కావ్య' అంటూ నినాదాలు చేశారు. దీంతో అనిరుధ్ సిగ్గుతో నవ్వుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
'కల్యాణ వయసు' పాటతో సందడి
ఈ కార్యక్రమంలో అనిరుధ్.. నయనతార నటించిన 'కొలమావు కోకిల' సినిమాలోని తన పాపులర్ పాట 'కల్యాణ వయసు'ను ఆలపించారు.
ప్రస్తుతం ఆయన పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పాట పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అదే సమయంలో అభిమానులు కావ్య మారన్ పేరుతో నినాదాలు చేయడంతో అక్కడ సందడి నెలకొంది.
అభిమానుల అల్లరిని చూసి అనిరుధ్ కూడా నవ్వుతూ వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడికి వచ్చిన వారితో సెల్ఫీలు దిగారు.
వివరాలు
నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో వివాహం
సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
అనిరుధ్, కావ్యల వివాహం నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో జరగనుంది. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అనంతరం నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
రిసెప్షన్‌కు ప్రముఖులకు ఆహ్వానాలు
వీరి రిసెప్షన్ తేదీని గత అక్టోబర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ధృవీకరించింది.
కావ్య తల్లిదండ్రులు కళానిధి, కావేరి మారన్‌లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వేడుకకు స్వయంగా ఆహ్వానించారు.
ప్రస్తుతం పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఐవరీ, పౌడర్ బ్లూ రంగుల్లో ప్రత్యేకంగా రూపొందించిన వీరి వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో పాటు రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.