NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / NKR21' కళ్యాణ్ కు మంచి బ్రేక్ ఇవ్వనుందా?
    తదుపరి వార్తా కథనం
    NKR21' కళ్యాణ్ కు మంచి బ్రేక్ ఇవ్వనుందా?
    NKR21' కళ్యాణ్ కు మంచి బ్రేక్ ఇవ్వనుందా?

    NKR21' కళ్యాణ్ కు మంచి బ్రేక్ ఇవ్వనుందా?

    వ్రాసిన వారు Stalin
    May 28, 2024
    06:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి కళ్యాణ్ రామ్ కు తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకత వుంది. పెద్దగా హడావుడి చేయరు. భిన్నమైన కథాంశాలతో నిర్మించటం ఆయనకు హాబీ.

    హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా మూవీస్ చేస్తూ వుంటారు. ఆ మధ్య 'డెవిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

    ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో 'NKR21' చేస్తున్నారు.

    ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఇవాళ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా NKR21 నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు.

    Details

    కొత్త గెటప్‌ లో కళ్యాణ్ రామ్‌  

    'ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్' అని NKR21 నుంచి చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది.

    వీడియోలో కళ్యాణ్ రామ్ పిడికిలి, కళ్లను చూపించారు. సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ఎంత దృఢంగా ఉండబోతుందో వీడియో చూస్తే తెలుస్తోంది.

    కళ్యాణ్ రామ్‌ని కొత్త గెటప్‌లో చూపించారు. ఈ సినిమా హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ అని విజువల్స్ బట్టి తెలుస్తోంది.

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్యాణ్ రామ్‌ హిట్ కొట్టాలని నందమూరి ఫాన్స్ కోరుకుంటున్నారు.

    సైలెంట్ గా వుండి మంచి హిట్ సాధించాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

    Details

    హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ పనులు

    ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఆమె ఈ సినిమాకు ఆమె సైన్ చేశారు.

    ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు.

    ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

    ఈ చిత్రానికి కాంతార ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కళ్యాణ్ రామ్

    తాజా

    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్

    కళ్యాణ్ రామ్

    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్  డెవిల్
    #NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది  తెలుగు సినిమా
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్  సినిమా
    డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్  సంయుక్తా మీనన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025