Nani: 'దిప్యారడైజ్' గ్లింప్స్ రిలీజ్‌కి ముహుర్తం ఫిక్స్.. స్పెషల్‌గా ప్లాన్ చేసిన నాని!
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్-3'లో నటిస్తున్న నాని, 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.
తాజాగా 'ది ప్యారడైజ్'కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్‌ను నాని సిద్ధం చేశాడట. కానీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్‌లో ఉందని సమాచారం.
Details
ఫిబ్రవరి 20న గ్లింప్స్
అనిరుధ్ మ్యూజిక్ కంప్లీట్ చేసిన వెంటనే, శ్రీకాంత్ ఓదెల గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి 20న గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్‌ను అందుకుంటున్నారు.
ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి విజయవంతమైన దర్శకులను పరిచయం చేసిన నాని, శ్రీకాంత్ ఓదెలను డైరెక్టర్‌గా పెట్టి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను నిర్మించే యోచనలో ఉన్నాడట.
అంతేకాకుండా, ప్రియదర్శిని హీరోగా 'కోర్ట్' అనే సినిమా కూడా నిర్మించాడు. మొత్తంగా నాని నటనతోనే కాకుండా నిర్మాతగా కూడా తన సక్సెస్‌ను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు.