
Mammootty: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! మలయాళ మెగాస్టార్ ఇంట్లో ఉండేందుకు సిద్ధమా?
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) లైఫ్‌స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తూ ఉంటారు.
సినిమా అవకాశాలు రావడమే కాకుండా, సోసైటీలో ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో భారీగా ఖర్చు పెడతారు.
వారి దుస్తులకు వేలకు వేల రూపాయలు వెచ్చించడమే కాదు, వారి లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో అభిమానులు ఎప్పుడూ వారి ఇళ్ల ముందు గుమికూడుతుంటారు.
వారి నివాసాలు, ఇంట్లోని వాతావరణం అనుభవించాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికి ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
Details
రూ.75వేలు చెల్లించాలి
తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన ఇంటిలో బస చేసే అవకాశం కల్పిస్తున్నట్టు సమాచారం.
కేవలం హోటల్‌లో ఒక గదికి ఎంత రెంట్ కడితే, అంతే ధరకు ఆయన ఇంట్లో ఓ గదిలో ఆతిథ్యం పొందే అవకాశం లభిస్తుందని తెలుస్తోంది.
ఇందుకోసం ఒక్కరోజు గడిపేందుకు రూ. 75,000 చెల్లించాల్సి ఉంటుంది.
Details
మమ్ముట్టి ఇంట్లోనే బస చేసే ఛాన్స్
మమ్ముట్టి ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆయనకు కేరళలోని కొచ్చిలో పనంపిల్లి నగర్(Panampilly Nagar)ప్రాంతంలో ఓ ప్రత్యేక ఇంటి ఉన్నట్లు సమాచారం.
కొంత కాలంపాటు అక్కడే నివసించిన ఆయన 2020లో ఎర్నాకులం (Ernakulam)కి మారిపోయారు. అప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉందట. దీంతో ఆ ఇంటిని ఖాళీగా వదిలేయకుండా, అభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందించాలని నిర్ణయించుకున్నారట.
ఆ ఇంట్లోనే మమ్ముట్టిని కలిసే అవకాశం ఉండకపోయినా, ఇంట్లోని ప్రత్యేక గ్యాలరీ రూమ్, ప్రైవేట్ థియేటర్ చూసేందుకు అవకాశం కల్పించనున్నారు.
ఇందుకు సంబంధించిన బుకింగ్స్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సమాచారం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తూ, తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.